Kalpatharuvu Second Season : కల్పతరువు రెండో సీజన్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోశ్‌కుమార్ - గ్రీన్ ఇండియా ఛాలెంజ్
Kalpatharuvu Second Season Launch : భిన్న రంగాల్లో ఉన్నప్పటికీ.. సమాజం బాగుండాలనే ఆశయం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో పాటు కల్పతరువు ద్వారా చేస్తుండటం భగవంతుడి సంకల్పంగా భావిస్తున్నానని రాజ్యసభ్య సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం కల్పతరువు రెండవ సీజన్‌ను ఆయన అతిథిగా హాజరై ప్రారంభించారు. కల్పతరువు-1లో బ్రహ్మకుమారీలు 16 లక్షల మొక్కలు నాటడం సంకల్పశక్తికి నిదర్శనం... కల్పతరువు-2లో అంతకుమించి మొక్కలు నాటాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నానని ఎంపీ అన్నారు. జోగినిపల్లి సంతోష్‌కుమార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మంచి మనసుకు నిదర్శనం అని బ్రహ్మకుమారీస్ మాత కుల్దీప్ దీదీ తెలిపారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నిర్మూలనకు పాటుపడటం, మొక్కలు నాటే అరుదైన వ్యక్తులను గుర్తించి అండగా నిలవడం వంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు కార్యనిష్టతో నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఎంపీ సంతోష్ చేస్తున్న నిరంతర కృషికి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మాత కుల్దీప్ దీదీ ఆకాంక్షించారు.