Kaleshwaram Chief Engineer on Medigadda Project : 'మేడిగడ్డ బ్యారేజీ అడుగున్నర మేర కుంగుబాటు.. డిజైన్లో లోపం లేదన్న ఇంజినీర్లు' - medi gadda Project Problem
Published : Oct 22, 2023, 7:25 PM IST
|Updated : Oct 22, 2023, 9:09 PM IST
Kaleshwaram Chief Engineer on Medigadda Project : భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌సీ చీఫ్ ఇంజినీర్ నల్లా వెంకటేశ్వర్లు స్పందించారు. ఈ బ్యారేజీ కుంగుబాటుపై నిపుణులు పరిశీలిస్తున్నారని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Projec) వద్ద ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టును 2019లో ఎల్ అండ్ టీ నిర్మించిందని గుర్తు చేశారు. డిజైన్లో ఎలాంటి లోపం లేదని వివరించారు. ఈ బ్యారేజీ అడుగున్నర మేర కుంగుబాటు వచ్చిందని స్పష్టం చేశారు.
Chief Engineer on Medigadda Project Issue: బ్యారేజీ కుంగుబాటు తర్వాత నీటిని దిగువకు విడుదల చేశామని ఇంజినీర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ను నిపుణుల విశ్లేషించి.. పరిశీలిస్తున్నారని అన్నారు. బ్యారేజీకి త్వరలోనే మరమ్మతులు చేపడతామని తెలిపారు. గతంలో 29 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చినా బ్యారేజీ చెక్కు చెదరలేదని గుర్తు చేశారు. గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పనిచేసిందని వివరించారు.