Kadem Project Water Flood : కడెం జలాశయానికి పోటెత్తిన వరద.. పని చేయని 7 గేట్లు - కడెం ప్రాజెక్టు
Heavy Flood Water To Kadem Reservoir : గతేడాది కడెం జలాశయానికి వరద బీభత్సం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా అంత మొత్తంలోనే వరద రావడంతో అధికారులు కడెం జలాశయం 18 గేట్లకు గానూ 11 గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆ మిగిలిన ఏడు గేట్లలో 3 గేట్లు మొరాయించగా.. మరో 4 గేట్లను మనుషుల సాయంతో హైండిల్ ద్వారా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696.250 అడుగులకు చేరుకుంది. జలాశయంలోని 11 గేట్ల ద్వారా లక్ష 70 వేల క్యూసెక్యుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో సాయంత్రానికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలాశయ పరిస్థితులను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఈఈ విఠల్ చేరుకొని పరిశీలిస్తున్నారు.