kadem Project Water Level Today : కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల - Adilabad District News
Published : Sep 3, 2023, 8:06 PM IST
kadem Project Water Level Today :ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు.. నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ రోజు జలాశయంలోకి 33 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరడంతో.. 2 వరద గేట్లను ఎత్తి 36 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. సాయంకాలానికి ప్రాజెక్టులోకి.. వరద ఉద్ధృతి కాస్త తగ్గడంతో అధికారులు గేట్లను మూసివేశారు.
కడెం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 696.40 అడుగులకు చేరింది. జలాశయంలోకి వరద ప్రవాహాన్ని బట్టి.. నీటిని దిగువకు విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి తీర ప్రాంతం వైపు పశువుల కాపరులు వెళ్లవద్దని హెచ్చరించారు. మరోవైపు రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.