Avinash mother health: నిలకడగా ఎంపీ అవినాష్ తల్లి ఆరోగ్యం.. హెల్త్ బులిటన్ విడుదల చేసిన విశ్వభారతి ఆసుపత్రి - శ్రీలక్ష్మీ
Avinash Reddy mother Srilakshmi health condition కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వాంతులు తగ్గాయని, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే ఆమెను సీసీయూ నుంచి సాధారణ గదికి తరలిస్తామని తెలిపారు. ఈ నెల 19 న ఛాతీ నొప్పి రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె నోటిద్వారానే ఆహారం తీసుకుంటున్నట్లు వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. బీపీ, పల్స్, శ్వాస తీసుకోవడం తదితర అంశాలన్నీ సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. త్వరలోనే ఆమెను సీసీయూ నుంచి సాధారణ వార్డుకు షిప్ట్‌చేయనున్నట్లు పేర్కొన్నారు.
శ్రీలక్ష్మి ఆరోగ్యం కుదుట పడేందుకు ఆసుపత్రి వర్గాలు తీవ్రంగా శ్రమించాయని.. వైద్యులు తెలిపారు. అయితే, అవినాష్ తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన సీబీఐ విచారణకు సైతం హాజరు కాలేదు. ఆసుపత్రిలో తన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడని.. వైసీపీ నేతలు తెలిపారు. ఎంపీ అవినాష్ వివేకా హత్య కేసులో విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇచ్చినా అవినాష్ మాత్రం తన తల్లి ఆరోగ్యం కుదుటపడిన తరువాతే విచారణకు హాజరవుతానని చెప్పడం జరగింది. ఈ రోజు ఎట్టకేలకు అవినాష్ తల్లి ఆరోగ్యం కుదుటపడినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ విషయంలో సీబీఐ అధికారులు ఎలా స్పందిస్తారనే అంశం ఆసక్తిగా మారింది.