KA Paul on Telangana Assembly Elections : రాష్ట్రంలో పాల్ రావాలి.. పాలన మారాలి : కేఏ పాల్ - Telangana Latest News
Published : Oct 14, 2023, 8:46 PM IST
KA Paul on Telangana Assembly Elections : తెలంగాణ రాష్ట్రంలో పాల్ రావాలి.. పాలన మారాలని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. ఈ మేరకు ఓయూలో ప్రవల్లిక ఆత్మహత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ బాగుపడాలని పెద్దలు అందరూ వచ్చి మద్దతు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు మద్దతు ఇవ్వాలని తనను కోరాడని తెలిపారు. తనను అందరూ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని కేఏ పాల్ తెలిపారు.
ఓయూలో ఆయన మాట్లాడుతూ మీరందరూ మద్దతు ఇచ్చి నన్ను గెలిపించుకుంటామని అంటే తప్పకుండా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని అన్నారు. అలా కాకుండా దొంగలు, గజ దొంగలు, కుటుంబ పాలన కావాలి అంటే మీ ఇష్టం అని అన్నారు. 2014లో ఇంత ధనవంతమైన రాష్ట్రం.. 2023 వచ్చే సరికి అప్పుల్లో ఉంటుందని ఊహించలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి 7 వేల కంపెనీలు తీసుకుని రాగలనని తెలిపారు. మన దేశంలో ఎంతో చైతన్యవంతులు ఉన్నారని.. కానీ వారికి మంచి చేసే రాజకీయ నాయకులు లేరని ఆరోపించారు.