తెలంగాణ

telangana

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం

ETV Bharat / videos

AP High Court CJ : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం - ఏపీ హైకోర్టు

By

Published : Jul 28, 2023, 12:20 PM IST

high court CJ: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌తో... గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను శాలువా, పుష్పగుచ్ఛంతో ముఖ్యమంత్రి జగన్‌ సన్మానించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

నూతన సీజే నేపథ్యమిదీ..జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ సొంత రాష్ట్రం జమ్మూకశ్మీర్‌. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు వచ్చారు. 1964 ఏప్రిల్‌ 25న జన్మించిన జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ తమ్ముడు కావడం విశేషం. 1989 అక్టోబరు 18న దిల్లీ, జమ్మూకశ్మీర్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదై.. 2011లో సీనియర్‌ న్యాయవాదిగా హోదా పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తిగా, 2022 జూన్‌ 10 నుంచి బాంబే హైకోర్టులో సేవలు అందించారు.

ABOUT THE AUTHOR

...view details