జూరాలకు పోటెత్తిన కృష్ణమ్మ.. 18 గేట్ల ద్వారా దిగువకు విడుదల - జూరాల జలాశయం
Jurala project water flow: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయంకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. ప్రస్తుతం అధికారులు ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.462 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 92వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ 18 గేట్ల ద్వారా అవుట్‌ఫ్లో 1 లక్ష 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జారాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుగా ఉంది.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST