JPS Dharna In Whole State : జేపీఎస్‌ల వినూత్న దీక్ష...ప్రభుత్వం దిగివచ్చేనా...? - జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు
JPS Dharna In Whole State : రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె కొనసాగుతోంది. గత 15 రోజులుగా విధులు బహిష్కరించిన జేపీఎస్‌లు కలెక్టరేట్లు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టారు. భద్రాద్రిలో ఏకంకా నదిలో దిగి క్రమబద్ధీకరణ చేయాలంటూ నినాదాలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది స్నానఘట్టాల వద్ద గోదావరి నదిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిక్‌లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడంలేదని పర్మినెంట్ చేయడంలో ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని గోదావరి నదిలో జలదీక్ష చేస్తే ముఖ్యమంత్రి తమ ఆవేదనను వింటారన్న ఉద్దేశంతో జలదీక్ష చేపట్టినట్లు తెలిపారు. అనంతరం భద్రాద్రి రామయ్య సన్నిధికి వెళ్లి భద్రాద్రి సీతారాములకు వినతి పత్రం అందజేశారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ 15 రోజులుగా విధులు బహిష్కరించి జూనియర్ పంచాయతీ సెక్రటరీలు... కలెక్టరేట్లు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలపరిషత్ డివిజన్‌కు చెందిన జేపీఎస్‌లు నిరసన దీక్ష చేపడుతున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం విధులు నిర్వహించాలని సూచించిన ఏ మార్పు కనిపించడం లేదు.