తెలంగాణ

telangana

Jubilee Hills MLA PA Arrest in Attack Case

ETV Bharat / videos

Jubilee Hills MLA PA Arrest in Attack Case : వ్యక్తిని చితకబాదిన ఎమ్మెల్యే గోపీనాథ్​ పీఏ.. అరెస్ట్​ చేసిన పోలీసులు - జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గొడవ కేసులో పీఏ అరెస్ట్

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 2:22 PM IST

Jubilee Hills MLA PA Arrest in Attack Case : జూబ్లీహిల్స్‌లోని ఎల్‌.ఎన్ నగర్‌లో ఒక వ్యక్తిని చితకబాదిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు.. బాధితుడిపై దాడి చేసిన భాస్కర్, లలిత్‌ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ పీఏ భాస్కర్ శనివారం అర్ధరాత్రి మరికొంతమందితో కలిసి​ ఓ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

జూబ్లీహిల్స్​ ఇన్​స్పెక్టర్​ రవీంద్ర ప్రసాద్​ తెలిపిన వివరాల ప్రకారం.. 'కృష్ణా నగర్‌లో శనివారం అర్ధరాత్రి చందు అనే వ్యక్తి ఒక మహిళతో మాట్లాడుతున్నారు. వాళ్లిద్దరిని లలిత్ అనే వ్యక్తి ఆ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించగా.. చందు, లలిత్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో లలిత్‌ను కింద నెట్టేయగా.. అతను తన స్కూటీతో సహా కిందపడిపోయాడు. కోపానికి గురైన లలిత్ తన ఫ్రెండ్స్‌ని తీసుకొని వచ్చాడు. ఇందులో భాస్కర్ తదితరులు ఉన్నారు. వీరంతా కలిసి చందుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ వీడియో వైరల్​ కావడంతో ఇద్దరిని అరెస్ట్​ చేశాం. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నాం' అని సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details