తెలంగాణ

telangana

Fire Accident at Jubilee Hills

ETV Bharat / videos

Jubilee Hills Fire Accident Today : బర్గర్​ దుకాణంలో అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్​ బంక్​.. తప్పిన పెను ప్రమాదం - Hyderabad latest news

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2023, 2:28 PM IST

Jubilee Hills Fire Accident Today : జూబ్లీహిల్స్​లో అగ్నిప్రమాదం సంభవించింది. రోడ్ నంబర్ 36లో ఉన్న బిగ్గిస్ బర్గర్ షాప్​లో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బర్గర్​ షాప్​ యజమాని.. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వేగంగా మంటలను ఆర్పారు. ముందు జాగ్రత్త చర్యగా బర్గర్​ షాప్​ పక్కన ఉన్న.. పెట్రోల్​ బంక్​ను మూసివేశారు. షాప్​లో షార్ట్​ సర్క్యూట్​ వల్ల ప్రమాదం చోటుచేసుకుందని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఆస్తినష్టం తప్ప ప్రాణనష్టం ఏం సంభవించలేదని తెలిపారు. బర్గర్​ షాపులో ఫైర్​ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల అగ్నిప్రమాదం చోటుచేసుకుందని.. షాప్​ యాజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

ఏదేమైనా ఈ మధ్యకాలంలో నగరంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. షాప్​ యజమానులు పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఫైర్ ​సేఫ్టీ నియమాలను పాటించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details