తెలంగాణలో కుటుంబపాలన అంతానికి సమయం ఆసన్నమైంది : జేపీ నడ్డా
Published : Nov 27, 2023, 3:52 PM IST
JP Nadda Roadshow in Jagtial :రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటేనని, కుటుంబపార్టీలేనని.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణికి మద్దతుగా.. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
BJP Election Campaign :బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలేనని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలమయ్యిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కుటుంబపాలన నడుస్తోందని.. కల్వకుంట్ల కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను తీర్చలేకపోయారన్నారు. పేదలకు డబుల్‌బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. రాఫెల్, కామన్వెల్త్ గేమ్స్, 2జీ వంటి అనేక స్కాంలు జరిగాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.