తెలంగాణ

telangana

Johnny Master Choreographer

ETV Bharat / videos

Johnny Master Choreographer : తెలుగు డ్యాన్సర్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ప్రమాణ స్వీకారం

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 10:48 PM IST

Johnny Master Choreographer :తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్​ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రముఖ యువ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎన్నికయ్యారు. జూబ్లీహిల్స్ జేఆర్ఎస్​సీ కన్వెన్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయంలో జానీ మాస్టర్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. జానీ మాస్టర్​​ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అసోషియేషన్​ సభ్యులు ఆయనకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదరప్రసాద్​తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్లు హాజరయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన జానీ మాస్టర్​కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన జానీ.. డ్యాన్సర్స్ అసోసియేషన్​ను స్థాపించిన సీనియర్ నటుడు, డ్యాన్సర్ ముక్కురాజును గుర్తుచేసుకున్నారు. ఆయన కృషి వల్లే తామంతా చిత్ర పరిశ్రమలో ఒక అసోసియేషన్​గా ఏర్పడి ఉన్నత స్థానంలో ఉన్నామని తెలిపారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేయనున్నట్లు జానీ మాస్టర్ చెప్పారు.  

ABOUT THE AUTHOR

...view details