తెలంగాణ

telangana

Jogulamba Gadwal Fire Accident Today

ETV Bharat / videos

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్‌ బస్సు బోల్తా - మహిళ సజీవదహనం - గద్వాల జిల్లాలో బస్సు బోల్తా

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 6:45 AM IST

Updated : Jan 13, 2024, 6:54 AM IST

Jogulamba Gadwal Fire Accident Today :జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి చిత్తూరు వెళుతున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఎర్రవల్లి చౌరస్తా వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో  ఒక్కసారిగా బస్సుకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవదహనమైంది.  మరో నలుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Bus Overturned in Gadwal District :  అప్రమత్తమైన ప్రయాణికులు వివిధ మార్గాల ద్వారా బస్సులోంచి బయట పడ్డారు. కానీ ఓ మహిళ చెయ్యి ఇరుక్కుపోవడంతో బయటికి రాలేకపోయింది. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈలోపు మంటలు తీవ్రం కావడంతో బస్సులోనే మహిళ సజీవ దహమైంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ నిద్రమత్తు వల్ల ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

Last Updated : Jan 13, 2024, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details