JioBook Laptop Sales : జియోబుక్ ల్యాప్‌టాప్ సేల్ ప్రారంభం.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్! - రిలయన్స్ జియోబుక్ సేల్స్
JioBook Laptop Sales Start Date : రిలయన్స్ జియో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన 'జియోబుక్' సేల్ శనివారం (ఆగస్టు 5) ప్రారంభం అయ్యింది. ఈ బడ్జెట్ ల్యాప్‌టాప్ రిలయన్స్ రిటైల్ స్టోర్స్, ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ జియోబుక్ ల్యాప్‌టాప్‌పై భారీ డిస్కౌంట్స్ కూడా అందిస్తున్నారు. కేవలం రూ.16,499 ధర మాత్రమే ఉన్న ఈ ల్యాప్‌టాప్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉండడం గమనార్హం. ఈ జియోబుక్ ల్యాప్‌టాప్ JioOSతో రన్ అవుతుంది. దీనిలో మీడియాటెక్ చిప్సెట్ ఉంది. ఈ బడ్జెట్ ల్యాప్‌టాప్ 4జీ ఇంటర్నెట్ కనెక్టివిటీతో వస్తుంది. కనుక దీనిలో హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. 4జీబీ+ 64జీబీ స్టోరేజ్ + 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫెసిలిటీతో వస్తున్న ఈ ల్యాప్‌టాప్‌లో.. జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, జియో మీట్ లాంటి ఇన్‌బిల్ట్ యాప్స్ ఉన్నాయి. బ్లూ, గ్రే కలర్ వేరియంట్స్‌లో ఈ జియోబుక్ ల్యాప్‌టాప్ లభిస్తుంది. రిలయన్స్ జియో కంపెనీ.. ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఫుల్డే లైఫ్ కలిగి ఉంటుందని.. వినియోగదారులు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ జియోబుక్‌ను ఉపయోగించుకోవచ్చు అని చెబుతోంది.