కాంట్రాక్టర్‌ను షూతో కొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్ - వైరల్ న్యూస్
మధ్యప్రదేశ్, ఝాబువా జిల్లాలోని థాంద్లా నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వీర్ సింగ్ భూరియా.. ఓ కాంట్రాక్టర్‌ను షూతో కొట్టారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కుళాయి నీటి పథకంలో భాగంగా కచల్దారా గ్రామంలో నిర్మిస్తున్న ట్యాంకును పరిశీలించేందుకు ఎమ్మెల్యే అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ట్యాంకు నాణ్యత విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాట పెరగటం వల్ల సహనం కోల్పోయిన ఎమ్మెల్యే వీర్ సింగ్ కాంట్రాక్టర్‌పై షూతో దాడి చేశారు. ఈ వీడియో వైరల్ కావటం వల్ల కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా, నాసిరకంగా పనులు చేయటం వల్లే ప్రశ్నించామని సమర్థించుకున్నారు ఎమ్మెల్యే. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST