నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : జీవన్‌రెడ్డి - జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్జి
Published : Nov 15, 2023, 5:57 PM IST
Jeevan Reddy Fires on CM KCR :నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులన్నీ కమీషన్ కోసం నిర్లక్ష్యంగా నిర్మాణం చేపట్టిందని ఆరోపించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎమ్మెల్యేదని అన్నారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలతో తనకు ఎనలేని అనుబంధం ఉందని.. వారికి నిరతరం సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిపారు.
ప్రజలు సీఎం కేసీఆర్‌కు పదేళ్ల పాలనకు అవకాశం ఇచ్చారని.. ప్రస్తుతం వారు మార్పు కోరుకుంటున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఓడిపోతారని జీవన్‌రెడ్డి జోస్యం చెప్పారు. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.