బైక్పై వెళ్తుండగా ప్రమాదం.. అంబులెన్సు ఆలస్యం.. జేసీబీలో ఆస్పత్రికి.. - hospital on jcb
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తిని జేసీబీలో ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్లోని కట్నీలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అంబులెన్సు రావడం ఆలస్యం కావడం వల్ల స్థానికులు జేసీబీలో బాధితుడిని తీసుకెళ్లారు. బాధితుడు బైక్పై వెళ్తుండగా.. బర్హీ ప్రాంతంలో ప్రమాదం జరిగిందని చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ ప్రదీప్ ముధియా తెలిపారు. '108 నెంబర్కు స్థానికులు కాల్ చేశారు. కానీ అంబులెన్సు సర్వీసులు అందిస్తున్న ఏజెన్సీ మారింది. దీంతో అంబులెన్సు అందుబాటులో లేదు. వేరే పట్టణం నుంచి రావాల్సిన అంబులెన్సు ఆలస్యమైంది' అని ప్రదీప్ వివరించారు. కట్నీ ప్రాంతానికి నూతన అంబులెన్సు సమకూర్చేందుకు ప్రతిపాదనలు పంపినట్లు స్పష్టం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST