Janhvi Kapoor visited Tirumala: తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ కపూర్ - janhvi kapoor in tirumala
Published : Aug 28, 2023, 1:56 PM IST
Actress Janhvi Kapoor visited Tirumala: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు.. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకొని ఆమె మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం అందజేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం ఈ భామ తెలుగు తెరపై తన నటనను ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది. అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
నిన్న తిరుమలలో శ్రీవారిని 79,152 మంది భక్తులు దర్శించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పట్టింది. భక్తులు 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. 30,329 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు వరకు వచ్చింది.