కశ్మీర్లో భారీగా హిమపాతం.. విరిగిపడిన కొండ చరియలు.. రవాణా సేవలకు తీవ్ర ఆటంకం - జమ్ముకశ్మీర్ లేటెస్ట్ న్యూస్
కశ్మీర్ లోయలో జోరుగా మంచు కురుస్తోంది. ఫలితంగా రవాణా సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. హిమపాతం కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్నింటిని దారి మళ్లించారు. మరోవైపు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల రెండ్రోజులుగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రాంబన్ ప్రాంతంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు, వాహనదారులకు ఆహారం అందించినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్ జాతీయ రహదారిని పునరుద్ధించే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది.