తెలంగాణ

telangana

Congress Leader Jai Ram Ramesh Campaign Telangana

ETV Bharat / videos

యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంది తెలంగాణలోనే : జైరాం రమేశ్‌ - జైరాం రమేశ్‌ కామెంట్స్ ఆన్ బీఆర్ఎస్

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 3:24 PM IST

Jai Ram Ramesh Election Campaign in Telangana : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో హైదరాబాద్‌ మాత్రమే అభివృద్ధి చెందిందని.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌(Jai Ram Ramesh) అన్నారు. సోనియా గాంధీ, మన్మోహన్‌సింగ్‌ వల్లే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. పదేళ్లలో ఒక కుటుంబం రాష్ట్ర లక్ష్యాలను నాశనం చేసిందని పేర్కొన్నారు.

AICC General Secretary Telangana Tour: దేశంలో ప్రస్తుతం అత్యధిక నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని జైరాం రమేశ్ విమర్శించారు. దేశవ్యాప్తంగా 10 శాతం నిరుద్యోగిత ఉంటే.. తెలంగాణలో 15 శాతం నిరుద్యోగిత ఉందన్నారు. యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంది తెలంగాణలోనేనని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క ఉద్యోగ పరీక్ష నిర్వహిస్తే అది కూడా రద్దు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలలు కన్న సామాజిక తెలంగాణ రాలేదని విమర్శించారు. నవంబర్ 30న కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి.. గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details