Jagtial Old Woman Viral Video : రాఖీ కట్టేందుకు కాలినడకన తమ్ముడి ఇంటికి 80 ఏళ్ల అవ్వ.. వీడియో వైరల్ - రాఖీ పండుగ 2023 తాజా వార్తలు
Published : Aug 30, 2023, 9:41 PM IST
Jagtial Old Woman Viral Video : సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ. ప్రేమ అనే రాఖీని చేతికి కట్టి.. ఆప్యాయత, అనురాగాల తీపిని పంచి.. నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష అనే జీవితపు హామీ తీసుకునే పండుగే రక్షాబంధన్. వసివాడని ఆ అనుబంధాన్ని రక్షా బంధనాల్లోనూ చూపాలని ఏ సోదరి మాత్రం కోరుకోదూ. ఇలానే ఓ 80 సంవత్సరాల వృద్ధురాలు.. తన తమ్ముడికి రాఖీ కట్టాలని అనుకుంది. కానీ అక్కడికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో కాలినడకనే సోదరుడి ఇంటికి బయలుదేరింది జగిత్యాల జిల్లాకు చెందిన బక్కవ్వ.
మల్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో బక్కవ్వ అనే మహిళ నివసిస్తోంది. రాఖీ పండుగ నాడు.. తన సోదరుడు మల్లేశంకు రాఖీ కట్టాలని అనుకుంది. మల్లేశం గంగాధర మండలం కొండాయపల్లిలో నివాసం ఉంటున్నాడు. అక్కడికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదు. దీంతో బక్కవ్వ కాలినడకనే తమ్ముడి ఇంటికి చేరుకుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.