తెలంగాణ

telangana

Woman Suicide Attempt

ETV Bharat / videos

Jagtial Bus Accident : బస్సు డ్రైవర్​ అప్రమత్తతో.. దక్కిన మహిళ ప్రాణం - మహిళ సూసైడ్

By

Published : Jul 21, 2023, 3:48 PM IST

Woman Suicide Attempt :జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతో  ఓ నిండు ప్రాణం దక్కింది. మెట్​పల్లి నుంచి ప్యాసింజర్లను ఎక్కించుకొని జగిత్యాల వైపు వెళుతున్న ఆర్​టీసీ బస్సు కింద మహిళ పడిపోయింది. ఈ క్రమంలో బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో అకస్మాత్తుగా డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సు ఆగిపోగా... మహిళ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి, అంబులెన్సు సహాయముతో మెట్​పల్లి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఆమెను మెట్​పల్లి పట్టణానికి చెందిన పుప్పాల లక్ష్మీగా గుర్తించారు. డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా నిండు ప్రాణం వెనుక చక్రాల కింద నలిగిపోయేదని స్థానికులు తెలిపారు. తొలుత ప్యాసింజర్ ఎక్కుతుండగానే డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడని భావించినప్పటికీ సీసీ కెమెరాలో నమోదైన ఫుటేజ్​లో మాత్రం డ్రైవర్ అప్రమత్తత వల్లనే ప్రాణం దక్కినట్లు తేలింది. సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తే.. మహిళ ఉద్దేశ పూర్వకంగానే బస్సు కింద పడేందుకు యత్నించినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details