2014 నాటికి డిస్కంల అప్పు రూ.44 వేల కోట్లు : జగదీశ్‌రెడ్డి - శ్వేతపత్రంపై జగదీశ్ రెడ్డి స్పందన
Published : Dec 21, 2023, 8:35 PM IST
Jagadeesh Reddy Clarify on Power White Paper: శాసనసభలో నేడు విద్యుత్ రంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా ఆ శాఖ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రభుత్వానికి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఏర్పడే నాటికి మన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7 వేల మెగా వాట్లు ఉందని జగదీశ్ రెడ్డి(Jagadeesh Reddy) చెప్పారు. 2014 నాటికి డిస్కంల అప్పు రూ.44 వేల కోట్లు ఉందని తెలిపారు. బొగ్గు ధరలు, గ్రీన్ సెస్, రవాణా ఛార్జీలు పెరగడం వల్ల డిస్కంలపై భారం పడిందని వివరించారు.
Ex Minister Jagadeesh Reddy on White Paper : యూపీఏ వల్లే బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇచ్చింది అని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్న జగదీశ్‌రెడ్డి, అలా అయితే పక్క రాష్ట్రాల్లో ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కర్ణాటక, రాజస్థాన్‌లో 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారని, అది ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.