తెలంగాణ

telangana

ITI Students Makes Vintage Bikes

ETV Bharat / videos

స్క్రాప్​తో వింటేజ్ బైక్ బొమ్మల తయారీ.. ఐటీఐ విద్యార్థుల అద్భుత ప్రతిభ.. - ఒడిశా విద్యార్థుల ప్రతిభ

By

Published : Jul 21, 2023, 7:55 PM IST

ITI Students Makes Vintage Bikes : ఒడిశా బ్రహ్మపురలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థులు స్క్రాప్​తో వింటేజ్ బైక్ బొమ్మలను తయారు చేశారు. వారికి ఐటీఐ కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం అండగా నిలిచింది.

బ్రహ్మపుర ఐటీఐ కళాశాల విద్యార్థులు.. బోల్టులు, పాత బైక్ చైన్​లు వంటి స్క్రాప్​ మెటీరియల్​ను ఉపయోగించి.. కేటీఎం, డ్యూక్, యమహా, బుల్లెట్ వంటి వింటేజ్ బైక్ బొమ్మలను రూపొందించారు. 'బెస్ట్ ఫ్రమ్ వేస్ట్' అనే సందేశంతో బ్రహ్మపుర ఐటీఐ కళాశాలలోని ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్‌స్ట్రమెంట్​ మెకానిక్స్, వెల్డర్ సహా అన్ని ట్రేడ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. విద్యార్థులు స్క్రాప్​ సామాన్లను గ్యారేజీల నుంచి సేకరించారు. జులై 15న బ్రహ్మపురలోని ఐటీఐ కాలేజీలో ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఈ నెల 23 వరకు జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్​లో విద్యార్థుల తయారు చేసిన వింటేజ్ బైక్​ల బొమ్మలను ఉంచారు. 15 రోజులు కష్టపడి నిరుపయోగంగా ఉన్న స్క్రాప్​ మెటీరియల్‌తో బైక్​లను తయారు చేశారు విద్యార్థులు.

ABOUT THE AUTHOR

...view details