IT Employees Protesting Chandrababu Arrest in Metro Stations : మెట్రోలో 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్'.. పోలీసుల తీరుతో ఉద్రిక్తత - చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ధర్నా
Published : Oct 14, 2023, 1:57 PM IST
IT Employees Protesting Chandrababu Arrest in Metro Stations at Hyderabad : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఐటీ ఉద్యోగులు లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమం పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం మెట్రో స్టేషన్ల వద్దకు భారీగా ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు తరలివచ్చారు. నల్ల షర్టులు, నల్ల టీషర్ట్స్ ధరించి.. బాబు అరెస్టుకు నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ మద్దతు ప్రకటించారు. లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న మెట్రో స్టేషన్లలో భారీగా పోలీసులను మోహరించారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో అప్రమత్తమైన పోలీసులు.. నల్లషర్ట్, టీషర్ట్సులు ధరించిన వారిని స్టేషన్ లోపలికి అనుమతించలేదు. ఇంకా మెట్రో స్టేషన్ ప్లాట్ఫామ్ పైనా తనిఖీలు నిర్వహించారు. ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు నాయుడు మద్దతుదారులు కదం తొక్కడంతో మెట్రో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే మెట్రో స్టేషన్లు పూర్తిగా రద్దీగా మారాయి. కొన్ని చోట్ల పోలీసులు.. నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.