అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌లో సాగు నీటి కేటాయింపులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Published : Jan 13, 2024, 4:18 PM IST
Irrigation Minister Uttam Kumar Reddy Interview :అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే విషయమై దృష్టి సారిస్తామని, ఈ ఏడాది నాలుగున్నర నుంచి ఐదు లక్షల ఎకరాల వరకు సాగు నీరు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామన్న ఆయన, మేడిగడ్డ వ్యవహారంపై ముందు జాగ్రత్తగా విజిలెన్స్ విచారణ చేపట్టినట్లు వివరించారు. అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌లో సాగునీటి కేటాయింపులు ఉంటాయని వెల్లడించారు.
F2F with Minister Uttam Kumar Reddy :కేసీఆర్ సర్కార్ తప్పిదాలతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లో నీరు లేని పరిస్థితి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాగు నీటి అవసరాలకు కర్ణాటక ప్రభుత్వాన్ని 10 టీఎంసీలు అడుగుతున్నామని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ప్రాణహిత ప్రాజెక్టును చేపడతామని పునరుద్ఘాటిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..