Irom Sharmila Chanu on Chandrababu Naidu Arrest: ప్రజానాయకుడి అరెస్ట్‌ను ప్రతి ఒక్కరూ ఖండించాలి: ఇరోమ్ షర్మిల - political leaders Reaction on Chandrababu arrest
🎬 Watch Now: Feature Video
Published : Sep 15, 2023, 9:25 PM IST
Irom Sharmila Chanu on Chandrababu Naidu Arrest:తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు రోజురోజుకీ సంచలనంగా మారుతోంది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. దీంతో ప్రపంచం కన్ను ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మీద పడింది. ఇదిలా ఉండగా చంద్రబాబు అరెస్టుపై ఎంతో మంది స్పందిస్తున్నారు. దేశంలోని ఎంతో మంది జాతీయ నాయకులతోపాటు అనేక మంది ప్రముఖులు చంద్రబాబు అరెస్టు చేసిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు అరెస్టుపై మణిపూర్‌కి చెందిన ఉక్కు మహిళ, పౌర హక్కుల నేత ఇరోమ్ షర్మిల స్పందించారు. తాజాగా ఆమె చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. తెలుగుదేశం అధినేత చాలా దార్శనికుడని.. అలాంటి ప్రజా నాయకుడి అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు.