తెలంగాణ

telangana

Iphone 15 Sale In India

ETV Bharat / videos

Iphone 15 Sale In India : భారత్​లో ఐఫోన్​ మేనియా.. స్టోర్ల ముందు బారులు తీరిన టెక్​ ప్రియులు - ఐఫోన్​ 15 ఇండియా సేల్స్

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 10:16 AM IST

Iphone 15 Sale In India : టెక్​ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఫోన్​ 15 అమ్మకాలు భారత్​లో మొదలయ్యాయి. దేశంలోని రెండు స్టోర్ల ముందు జనాలు సందడి నెలకొంది. శుక్రవారం ఉదయం అమ్మకాలు మొదలుపెట్టగా.. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ముంబయిలోని బీకేసీ వద్ద ఉన్న యాపిల్​ స్టోర్​ వద్దకు ప్రజలు భారీగా వచ్చారు. 

మరోవైపు దేశ రాజధాని దిల్లీ సాకేత్​లోని రెండో స్టోర్​ వద్ద కూడా సందడి వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ప్రజలు లైన్​లో నిలబడ్డారు. భారత్​లో తొలి ఐఫోన్​ 15 కోనుగోలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు కొనుగోలుదారుడు రాహుల్​. "భారత్​లో తొలి ఐఫోన్​ 15 కొనుగోలు చేయడం ఆనందంగా ఉంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి లైన్​లో నిలబడ్డాను. ఇప్పటికే విడుదలైన ఐఫోన్​ 13 ప్రో మాక్స్​, ఐఫోన్​ 14 ప్రో మాక్స్​ నా వద్ద ఉన్నాయి. తాజాగా ఐఫోన్​ 15 విడుదల కావడం వల్ల ఆ ఫోన్​ కోసం వచ్చాను." అని చెప్పాడు. సెప్టెంబర్​ 12న అమెరికా కాలిఫోర్నియాలోని యాపిల్‌ హెడ్​క్వార్టర్స్​లో 'వండర్‌ లస్ట్‌' పేరుతో అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లను యాపిల్‌ కంపెనీ విడుదల చేసింది. వీటితో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9, వాచ్‌ అల్ట్రా 2 లను కూడా విడుదల చేసింది.

ABOUT THE AUTHOR

...view details