తెలంగాణ

telangana

Interview with Telugu Rythubadi YouTuber

ETV Bharat / videos

Interview with Telugu Rythubadi YouTuber : తెలుగు "రైతుబడి" వ్యవసాయ ఒడి.. రైతుల కథనాలే కంటెంట్​గా కొనసాగిస్తూ మరో రూపంలో.. - తెలుగు రైతుబడి

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2023, 3:50 PM IST

Interview with Telugu Rythubadi YouTuber : ఎంత చదివినా.. కొలువులు అంటూ వెంపర్లాడటం లేదు. కర్షకుల కష్టం తెలిసిన తాను.. వారికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలనుకున్నాడు. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి.. ఆత్మ సంతృప్తి, నలుగురికి ఉపాధి కల్పన లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. పాత్రికేయుడి నుంచి యూట్యూబర్‌గా మారిన జూలకంటి రాజేందర్‌రెడ్డి. "రైతుబడి" యూట్యూబ్ ఛానల్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల కర్షకుల అభిమానం సొంతం చేసుకున్నాడు. వన్ మిలియన్ సబ్‌స్క్రైబర్లను సాధించి రైతుల గుండెసడిగా నిలిచిన రైతుబడి యూట్యూబ్ ​ఛానల్​.. డిజిటల్ మీడియాలో మైలురాయిని సాధించింది. 

Telugu Rythubadi Youtuber Rajender Reddy : తాజాగా రాజేందర్​రెడ్డి.. "రైతుబడి" డిజిటల్ మాసపత్రిక అందుబాటులోకి తెచ్చాడు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కొత్త ఒరవళ్లు, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, రైతుల విజయగాధలు, అధిక దిగుబడుల కోసం సూచనలు, సలహాలు ఛానల్ ద్వారా తెలిజేస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక వ్యవసాయం, టెక్నాలజీ, యాంత్రీకరణ, ప్రదర్శనలు యూట్యూట్ ఛానల్‌, వెబ్‌సైట్ ద్వారా పరిచయం చేస్తానంటున్న "రైతుబడి" వ్యవస్థాపకుడు రాజేందర్‌రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details