Google Takeout: హాట్ టాపిక్‌గా గూగుల్ టేకౌట్.. అసలు దీని కథ ఏంటి.. నిపుణులు ఏం అంటున్నారు..? - Nallamotu Sridhar recent Tech News
Google Takeout: వైఎస్ వివేకా హత్య కేసును చేధించేందుకు సీబీఐకి దొరికిన ఆధారాల్లో గూగుల్ టేకౌట్ ఒకటి. ఈ కేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్.. వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నారని గూగుల్ టేకౌట్ విశ్లేషణ ద్వారా సీబీఐ తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలను అభియోగ పత్రాల్లో స్పష్టం చేసింది. అయితే ఈ గూగుల్ టేకౌట్ ద్వారా సేకరించిన ఆధారాలు ఎంత వరకు నిజం? వాటిని ఎలా కీలకంగా పరిగణించవచ్చు? గూగుల్ టేకౌట్ విశ్లేషణ ద్వారా ఎలాంటి ఆధారాలు సీబీఐ సేకరించవచ్చు?
గూగుల్ టేకౌట్‌లో ఏ సమాచారం సేవ్ అవుతుంది? మనం వెళ్లిన ప్రాంతాలను, డాటాను తొలగించినా గూగుల్ టేకౌట్‌లో సేవ్ అయి ఉంటుందా? అసలు మన వ్యక్తిగత సమాచారాన్ని.. కేసు విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు సమాచారం కోరవచ్చా? దర్యాప్తు సంస్థలకి సమాచారం ఖచ్చితంగా ఇవ్వాలా? గూగుల్ టేకౌట్ డాటాను సమర్పిస్తే కోర్టులు అంగీకరిస్తాయా? ఇలాంటి టెక్నాలజీ ద్వారా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో దర్యాప్తు సంస్థలు ఎలాంటి కేసులను పరిష్కరించాయనే తదితర వివరాలను.. ప్రముఖ సాంకేతిక నిపుణులు నల్లమోతు శ్రీధర్ తెలియజేశారు.