Prasanth Reddy Interview : 'అన్ని రంగాల్లోనూ దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది' - telangana decade celebrations
Prasanth Reddy Interview : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతున్న సందర్బంగా ప్రభుత్వం ఉత్సవాలు చేస్తోంది. 21 రోజుల పాటు అన్ని వర్గాలను భాగస్వాములను చేసేలా ప్రణాళిక చేస్తున్నారు. పదేళ్ల కాలంలో చేపట్టిన పథకాలు, వాటి ద్వారా చేకూరిన ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన లబ్ధిదారులను ఉత్సవాల్లో భాగం చేయనున్నారు. ఏర్పాట్లలో ప్రభుత్వం అండగా.. కార్యక్రమాల రూపకల్పనలో మంత్రి ప్రశాంత్ రెడ్డి భాగం అయ్యారు. అన్ని రంగాల్లోనూ దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో పది జిల్లాలు ఉంటే.. అందులో 9 జిల్లాలు కరవు జిల్లాలుగా కేంద్ర జాబితాలో ఉండేవన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి.. ప్రతి జిల్లా సస్యశ్యామలంగా ఉందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో జిల్లాలు అన్ని ముందున్నాయని.. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే కేసీఆర్ కుటుంబం విదేశాల నుంచి వచ్చారని ప్రశాంత్ రెడ్డి వివరించారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి జూన్ నాటికి పది సంవత్సరాలు కావస్తున్న వేళ.. దశాబ్ది ఉత్సవాలపై మంత్రి ప్రశాంత్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.