Interview with Jagga Reddy : 'ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశంపై సమావేశంలో చర్చే జరగలేదు' - తెలంగాణ రాజకీయాలు
Published : Aug 30, 2023, 1:42 PM IST
Interview with Jagga Reddy on MLA Tickets : ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో రెండు టికెట్ల అంశం నిన్న జరిగిన సమావేశంలో చర్చకే రాలేదని.. బయట జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కుటుంబంలో రెండు టికెట్లు అనేదానిపై అధిష్ఠానానిదే తుదినిర్ణయమని.. ఆ మేరకు జాబితా పంపించాలని మాత్రమే చర్చించినట్లు చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి టికెట్లపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చర్చించామని జగ్గారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తొలి జాబితాలో టిక్కెట్లు కేటాయించాలని పీఈసీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10 నుంచి 15 తేదీల్లోగా తొలి జాబితా కచ్చితంగా వస్తుందని హామీ ఇచ్చారు. టికెట్ల కేటాయింపు విషయంలో అందరికీ సమన్యాయం జరిగేలా చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. పీసీసీ జాబితా నిర్ణయించాక తుది ఎంపిక అధిష్ఠానం చేతిలో ఉంటుందన్నారు. ప్రాంతీయ పార్టీల్లో అభ్యర్థులను ఒకరే నిర్ణయిస్తుంటారు కానీ.. కాంగ్రెస్‌లో అందరికీ అడిగే స్వేచ్ఛతో పాటు విస్తృత చర్చలు జరుగుతాయని వెల్లడించారు.