తెలంగాణ

telangana

Interview with Fever Hospital Superintendent Mahbub Khan

ETV Bharat / videos

కొత్త వేరియంట్​తో భయం వద్దు - జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్న వైద్యులు - Corona updates in Telangana

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 9:49 PM IST

Interview with Fever Hospital Superintendent Mahbub Khan : కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేరళ సహా దేశవ్యాప్తంగా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం అప్రమత్తమైంది. ప్రస్తుతం జేఎన్1 వేరియంట్ రకం ఎక్కువగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ కేసుల కట్టడికి చర్యలు తీసుకోవటంతో పాటు మహమ్మారి విజృంభిస్తే సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఆస్పత్రులను సైతం సన్నద్ధం చేస్తోంది. 

Covid Updates in Telangana :ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 6 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  ప్రస్తుతం 19 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్​తో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details