కొనుగోలు కేంద్రాలు తెరిచినా కనిపించని రైతులు
Published : Dec 5, 2023, 5:49 PM IST
Farmers Interview about Selling of Paddy : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కంటే బహిరంగ మార్కెట్లో అధిక ధరలు పలుకుతుండటంతో రైతులు సన్నరకం ధాన్యాన్ని వ్యాపారులకే అమ్ముతుున్నారు. దొడ్డురకం ధాన్యం అమ్మడానికి మాత్రం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్నారు. సన్నరకానికి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి మంచి డిమాండ్ ఉంది. దీంతో వరి పండించిన రైతుకు మంచి గిట్టుబాటు ధర దక్కుతోంది.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో పాటు నిల్వ ఉంచేందుకు వ్యాపారులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యమైన సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ. 3200 వరకూ గరిష్ఠ ధర పలుకుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వానాకాలంలో 6,81,399 ఎకరాల్లో వరిసాగు వేశారు. ధాన్యంలో తేమశాతం, నాణ్యత లేకపోయినా మద్దతు ధరకు మించి వ్యాపారులు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై మా ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.