UPSC CIVILS RESULTS 2022 : 'నేను సివిల్స్ ర్యాంక్ సాధించేందుకు వారే కారణం' - interview with civil ranker sanketh
UPSC Civils Final Results 2022 : సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది మొత్తం 933మంది అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇషితా కిషోర్ ప్రథమ ర్యాంకు సాధించింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తాచాటారు. 35వ ర్యాంక్ సాధించిన సంకేత్ కుమార్ అజ్మీర్ ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి. అతని విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ ర్యాంక్ సాధించేందుకు అతని తల్లి ప్రోత్సాహం అందించారని చెప్పారు. అతను పుట్టిన గ్రామాల్లో ఉన్న సమస్యలను చూసి.. పేదలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అయితే అతను ఈ ర్యాంక్ సాధించేందుకు ఎలా ప్రిపేర్ అయ్యారు? రోజు ఎన్ని గంటలు చదివారు? ఎలాంటి పుస్తకాలను సేకరించి జ్ఞానాన్ని సంపాదించారు? ఏ ఏ సబ్జెక్ట్‌లో సన్నద్దం అవ్వడం వల్ల ఈ ర్యాంక్ సాధించారు? ఇలాంటి మరిన్ని విషయాలను సంకేత్ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం.