లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది : రంజిత్ రెడ్డి - Ranjith Reddy latest news
Published : Dec 28, 2023, 3:02 PM IST
Interview With Chevella BRS MP Ranjith Reddy : లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పుంజుకుంటుందని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు తర్వాత ప్రజలు ఎలైగైనా ప్రజలు మార్పు కోరుకుంటారు. జాతీయ స్థాయిలో రాజకీయాల్లో కేసీఆర్ ఉనికిని చాటడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రం ఏర్పాటులో ఎంతో ముఖ్యపాత్ర పోషించాడు. ఆ తర్వాత తెలంగాణను, ఆదర్శంగా ఎలా ముందుకు తీసుకెల్లాలో ఆయనకే తెలుసు. ప్రజలు కేసీఆర్‌కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.
BRS MP Ranjith Reddy : కేసీఆర్ ముఖ్యమంత్రి కానందుకు ఇప్పటికే చాలా మంది ప్రజలు బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్నే రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అన్న ఆయన రెండు అధికార పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల కంటే బీఆర్ఎస్ వైపే జనం నిలబడతారని తెలిపారు. జనవరి మూడో తేదీ నుంచి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ ఉంటుందంటున్న చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డితో ముఖాముఖి.