తెలంగాణ

telangana

bandi sanjay

ETV Bharat / videos

''పది' లీకేజీ కేసు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్ధమా..?' - 10తరగత పేపర్​ లీకేజీ కేసు

By

Published : Apr 7, 2023, 4:41 PM IST

Bandi Sanjay Interview : ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కుమారుడిని భర్తరఫ్‌ చేసి.. టీఎస్​పీఎస్సీ అభ్యర్థులకు పరిహారం అందించే వరకు బీజేపీ పోరాటం ఆగదన్నారు. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ విషయంపై ఇప్పటికీ సీఎం కేసీఆర్​ స్పందించలేదన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పదో తరగతి ప్రశ్నాపత్రం బయటికొచ్చిందంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు.

హిందీ ప్రశ్నాపత్రం బయటికి వచ్చిందంటున్నారు.. మరి తెలుగు పేపర్​ సంగతేంటిని సంజయ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్​ జడ్జితో విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ.. ప్రభుత్వానికి సవాల్​ విసిరారు.

అరెస్ట్​ గొడవతో.. తన ఫోన్​ పట్టుకెళ్లి మళ్లీ తననే అడుగుతున్నారని బండి సంజయ్​ అన్నారు. అయినా నా ఫోన్​ ఇస్తే ఏం చేస్తారు.. అందులో ఏముంటుందని ఎద్దేవా చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. నిరుద్యోగులకు న్యాయం కోసం వరంగల్‌ నుంచి పోరాటాలు ప్రారంభిస్తామంటున్న బండి సంజయ్‌తో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details