International Yoga Day in Hyderabad : 'యాంత్రిక జీవనంలో ప్రజలకు యోగా దివ్య ఔషధం' - యోగా వేడుకలో పాల్గొన్న లక్ష్మణ్
MP Laxman at International Yoga Day in Hyderabad : యావత్ ప్రపంచాన్ని యోగా దినోత్సవం పాటించే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి అచెంచలమైనదని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీనగర్ లోని సమతా భవన్ లో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా యోగా దినోత్సవం పాటించడం అభినందనీయమని లక్ష్మణ్ అన్నారు.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం యోగా సాధన చేయడం ప్రారంభించామని లక్ష్మణ్ తెలిపారు. సాంప్రదాయ ఆహార అలవాట్లను పాటించడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పారు. యాంత్రిక జీవనంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు యోగ దివ్య ఔషధమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 70 ఏళ్ల వయసులో చురుగ్గా ఉన్నారంటే దానికి కారణం యెగా అన్నారు. యంగ్ ఇండియా ఫిట్ ఇండియా నినాదంతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కర్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.