ఆకాశంలో ఐ లవ్ మోదీ.. వెండితో పతంగి తయారు చేసిన వ్యాపారి - undefined
సోమనాథ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్లో ఐ లవ్ మోదీ అనే గాలిపటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గాలిపటాన్ని ఎగురవేసినప్పుడు అందిరి దృష్టిని ఆకర్షించింది. ఒడిశాకు చెందిన ఓ కైట్ మేకర్ దీన్ని రూపొందించారు. మోదీపై ఉన్న అభిమానంతో ఈ గాలిపటం తయారు చేశానని తయారీదారుడు చెప్పాడు. చైనా, జపాన్ నుంచి మెటీరియల్ తెప్పించి మరీ రెండు నెలలు కష్టపడి ఈ పతంగి తయారు చేశానని తెలిపాడు. కాగా, ఈ కైట్ ఫెస్టివల్లో 15 దేశాలకు చెందిన పతంగి క్రీడాకారులు పాల్గొన్నారు. మరోవైపు, సూరత్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి వెండితో పతంగి రూపొందించాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన ఆత్మీయులకు ఇలాంటి వెండితో చేసిన పతంగులను, చరకా యంత్రాలను కానుకగా ఇస్తారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పంతంగి తయారుచేశానని మేకర్ తెలిపాడు. 350 గ్రాములతో అధిక బరువున్న పతంగి తయారు చేశాడు. దీని ధర రూ. 35 నుంచి 40 వేల వరకు ఉంటుంది. ఇక అతి చిన్న వెండి పతంగి 7 నుంచి 125 గ్రాములతో ఉండి దాదాపు రూ.20 వేల వరకు ధర పలుకుతుందని చెబుతున్నాడు ఈ వ్యాపారి.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST