తెలంగాణ

telangana

Jewellery Fashion Show

ETV Bharat / videos

శ్రీలేఖ సింగరాలు.. ముద్దుగుమ్మల హంస నడకలు.. ఆకట్టుకున్న జ్యూయలరీ ఫ్యాషన్​ షో - Gold jewelery fashion show

By

Published : Apr 14, 2023, 6:03 PM IST

Jewellery Fashion Show at Hyderabad: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆభరణాల ప్రదర్శనకు హైదరాబాద్ మహానగరం వేదికకానుంది. మాదాపూర్‌లో యునైటెడ్‌ ఎగ్జిబిషన్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ జ్యూయలరీ పేరుతో మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను గురువారం ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనను అభరణాల తయారీదారులు, టోకు వ్యాపారులు, పరిశమ్ర సర్వీస్‌ ప్రొవైడర్ల కోసం జ్యూయలరీ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు యునైటెడ్‌ ఎగ్జిబిషన్‌ డైరెక్టర్‌ మనోజ్‌ తెలిపారు. ఇందులో దాదాపు 400పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దాదాపు 10 వేల మంది ప్రదర్శనలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రదర్శనలో పాల్గొనే వారు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పదర్శన కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా సరికొత్త డిజైన్‌ అభరణాలను పరిచయం చేస్తూ.. ప్రత్యేక ఫ్యాషన్‌ షో నిర్వహించారు. సినీ కథానాయిక శ్రీలేఖ సింగరాలు, అందమైన అమ్మాయిల హంస నడకలు బంగారు అభరణాల ప్రియులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details