Live Video : కమాండ్ కంట్రోల్ ఎదుట.. గేటు మీదపడి వ్యక్తి మృతి
Live Video of man killed after gate fell on him at CCC : బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) ఎదుట చోటుచేసుకున్న ప్రమాదంలో పారిశ్రామిక వేతైన మౌలాలీ మృతి చెందారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు ప్రాంతాన్ని రక్షణ వలయంగా తీర్చిదిద్దేందుకు ఇనుప గేట్ల పనులను చర్లపల్లికి చెందిన శ్రీసాయి ఇండస్ట్రీస్ ఎండీ వి.సుధాకర్(52) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
రోజులాగానే మంగళవారం కూడా మౌలాలీ అనే పారిశ్రామిక వేత్త గేటును ఏర్పాటు చేయడానికి వచ్చారు. గేటు ఏర్పాటు చేస్తూ.. పరిశీస్తున్న క్రమంలో అకస్మాత్తుగా గేటు ఆయన మీద పడింది. గేటు పడటం చూసి దగ్గరలోని కార్మికలంతా ఆ గేటు పక్కకి తోలగించి, అతనిని బయటకి తీశారు. గాయపడిన అతన్ని హుటాహుటిన.. సిటీన్యూరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్నా సీసీ టీవీ ఫుటెజీలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం గాగిల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఆయన మౌలాలీ హౌసింగ్ బోర్డులో నివసిస్తున్నారు. చర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్(టీఐఎఫ్), చర్లపల్లి ఐలాలో సభ్యులుగా కూడా ఆయన పనిచేశారు.