Indrakaran Reddy On BRS MLA Ticket Issues : 'మా పార్టీలో అసంతృప్త నాయకులు లేరు.. మేమంతా సోదరులమే' - Adilabad district latest news
Published : Sep 18, 2023, 1:02 PM IST
Indrakaran Reddy On BRS MLA Ticket Issues :బీఆర్ఎస్‌లో అసమ్మతికి, అసంతృప్తికి ఎలాంటి తావులేదని.. అక్కడక్కడ టిక్కెట్లు దక్కని కొంతమంది అభ్యర్థులు అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ఆయన డీసీఎంస్ నూతన భవనాన్ని ప్రారంభించారు. జోగు రామన్న, తాను అన్నదమ్ముల్లా కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ జమిలీ ఎన్నికల ఎత్తుగడలు వేస్తుందని ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు.
Indrakaran Reddy Fires on Congress and BJP :రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు టికెట్ల కుమ్ములాటతోనే సరిపోయిందని ఇంద్రకరణ్ రెడ్డి దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. వాళ్లు తమకు ప్రత్యర్థులు కానే కారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్‌లను ముందు వారి అధికార రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. కమలం పార్టీతో సహా హస్తం పార్టీని జనం బొందపెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని అంటున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ప్రత్యేక ముఖాముఖీ.