తెలంగాణ

telangana

భారత్ - అమెరికా మైత్రి మరింత బలపడాలి : రక్షణ రంగ నిపుణులు

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 4:33 PM IST

Indo US Defence Relations Meeting at Hyderabad

Indo US Defence Relations Meeting at Hyderabad :భారత్ -అమెరికా సంబంధాలు రాబోయే రోజుల్లో మరింత బలపడాల్సిన అవసరం ఉందని పలువురు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. హిందూ-పసిఫిక్‌ మహా సముద్రంపై చైనా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి భారత్ - అమెరికా మైత్రి మరింత పటిష్టంగా ఉండాలని వక్తలు తెలిపారు. భారత్ - అమెరికా రక్షణ రంగం సంబంధాలపై మరియట్ హోటల్‌లో సదస్సు జరిగింది.

ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా-చైనాల మధ్యం స్నేహం బలోపేతమవుతోందని దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని మాజీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ కపూర్ తెలిపారు. కేవలం అమెరికాతోనే కాకుండా ఇతర కీలక దేశాలతోనూ భారత్ సంబంధాలు మెరుగుపర్చుకోవాలని ఆయన సూచించారు. రక్షణపరంగానే కాకుండా కృత్రిమ మేథ, అంతరిక్ష రంగం, సైబర్ నేరాల నియంత్రణకు భారత్ - అమెరికా సహాయ సహకారాలు అందించుకోవాలని ఆయన సూచించారు. 

Indo US Defence Relations :అంతర్జాతీయ సరిహద్దు విషయంలో నిఘాపై ఇరు దేశాలు సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని విశ్రాంత మేజర్ జనరల్ పవన్ ఆనంద్ అన్నారు. హిందూ-పసిఫిక్ మాహా సముంద్రంలో, మధ్యదరా, ఎర్రసముద్రంలో ఇరు దేశాలను సమన్వయంతో నిఘా పెట్టాలని పవన్ ఆనంద్ సూచించారు. డేటా భద్రత ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుందని కీలక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెల్లకుండా అమెరికా-భారత్ సంయుక్తంగా కృషి చేయాలని పవన్ ఆనంద్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details