తెలంగాణ

telangana

గల్వాన్ లోయ ప్రాంతంలో క్రికెట్ ఆడిన భారత్ సైనికులు

ETV Bharat / videos

గల్వాన్​లో క్రికెట్ ఆడిన సైన్యం.. గుర్రాలపై స్వారీ.. ఐస్ హాకీ పోటీలకూ సై! - గాల్వాన్ లోయ ప్రాంతంలో భారత సైన్యం క్రికెట్

By

Published : Mar 4, 2023, 1:55 PM IST

వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)పై భారత్-చైనాల మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే, భారత్‌-చైనాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్‌ ప్రాంతంలో భారత్‌ సైనికులు క్రికెట్‌ ఆడుతున్న ఫొటోలను ఆర్మీ అధికారికంగా విడుదల చేసింది. అలాగే క్రికెట్​తో పాటు ఐస్ హాకీ పోటీల్లో కూడా సైనికులు పాల్గొన్నారు. గల్వాన్‌లో కచ్చితంగా ఎక్కడ క్రికెట్ ఆడుతున్నారనే విషయం చెప్పకపోయినప్పటికీ.. పెట్రోలింగ్‌ పాయింట్‌ 14కి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో సైనికులు ఆడుతున్న ప్రాంతం ఉండొచ్చని జాతీయ మీడియా వర్గాలు కథనాలు వెల్లడించాయి. త్రిశూల్ డివిజన్‌కు చెందిన పాటియాలా బ్రిగేడ్ ఆర్మీ క్రికెట్ ఈ పోటీని నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు, సైనికులు సరిహద్దుల్లో గుర్రాలపై పహారా కాస్తున్నారు. 2020 మే నెలలో ఇరుదేశాల సైనికుల మధ్య గల్వాన్‌ ప్రాంతంలోనే ఘర్షణ చోటు చేసుకొని... 20 మంది భారత్‌ సైనికులు వీరమరణం పొందగా.. చైనా మాత్రం మృతులు, క్షతగాత్రుల వివరాలను వెల్లడించలేదు. దిల్లీలో నిర్వహిస్తున్న జీ20 సదస్సులో భాగంగా భారత్‌ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌, చైనా విదేశాంగశాఖ మంత్రి చిన్‌ గ్వాంగ్ ముఖాముఖి సమావేశమైన తర్వాతి రోజునే ఇండియన్‌ ఆర్మీ ఫొటోలను పోస్టు చేయడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details