Independence Day Celebrations in Adilabad :160 అడుగుల త్రివర్ణ పతాకంతో తిరుగుతూ దేశభక్తిని చాటుకుంటున్న యువకులు.. - Adilabad latest news
Independence Day Celebrations in Adilabad : 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగురామన్న భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్‌డీబీఎస్ ఐటీ కంపెనీ 28లక్షలు వెచ్చించి నిర్మించిన 150 ఫీట్ల ఎత్తున్న జెండాపై జాతీయ పతాకాన్ని ఏర్పాటుచేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంత గృహ ఆవరణలో ఈ జెండాను ఆవిష్కరించగా.. కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జోగు ప్రేమేందర్, మాజీ ఎంపీ నగేష్‌లతో పాటు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు. జాతీయతను ఉట్టిపడేలా, అంతా కలిసి ఉండేందుకు ఈ భారీ జాతీయ పతాకం చిహ్నంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యువకులు 160 అడుగుల త్రివర్ణ పతాకంతో తిరుగుతూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఆసిఫాబాద్‌లోని కొమురం భీం చౌక్ నుండి ప్రారంభించి అంబేద్కర్ చౌక్ మీదుగా పట్టణంలోని పుర వీధుల్లో జాతీయ జెండాతో తిరుగుతూ హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఐక్యత్యాన్ని చాటారు. అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయడానికి ఆసిఫాబాద్ యూత్ ముందు అడుగులో ఉన్నారని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నుండి మొదలుకొని పెద్దవారు కూడా పాల్గొన్నారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరం కలిసి మెలిసి ఉండటానికి ఇదొక నిదర్శనం అని తెలియజేస్తున్నారు.