తెలంగాణ

telangana

Independence Day celebrations at Ramoji Film City

ETV Bharat / videos

Independence Day celebrations at Ramoji Film City : రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - హైదరాబాద్​లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

By

Published : Aug 15, 2023, 1:42 PM IST

Independence Day celebrations at Ramoji Film City : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా జరిగాయి. రామోజీ ఫిల్మ్‌ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ గీతాన్ని పాడారు. ఈ కార్యక్రమానికి యూకేఎమ్​ఎల్​ డైరెక్టర్‌ శివరామకృష్ణ, రామోజీ గ్రూపు సంస్థల మానవ వనరుల విభాగం ప్రెసిడెంట్‌ అట్లూరి గోపాలరావు హాజరయ్యారు. వీరితో పాటు రామోజీ గ్రూపులోని వివిధ విభాగాల అధిపతులు, ఉన్నతోద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

ఇదిలా ఉండగా.. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. దిల్లీలోని ఎర్రకోట గడ్డపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇక హైదరాబాద్​లోని గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట ప్రగతిని ప్రజలకు వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details