Independence Day Celebrations 2023 in Hyderabad : 1350 మంది విద్యార్థులతో.. 45,000వేల అడుగుల్లో జాతీయ జెండా - విజ్ఞాన జ్యోతి పాఠశాల్లో విద్యార్థులు ప్రదర్శన
Independence Day Celebrations 2023 in Hyderabad : విద్యార్థులు చిన్నతనం నుంచే దేశం పట్ల భక్తి భావం, అభిమానాన్ని నింపేందుకు వల్లూరిపల్లి రాజశేఖర్ ట్రస్ట్ పాఠశాల వినూత్న ప్రయత్నం చేసింది. హైదరాబాద్‌లోని బాచుపల్లిలో విశ్వ గురు వరల్డ్ రికార్డ్ వారి పర్యవేక్షణలో విజ్ఞాన జ్యోతి పాఠశాలలోని 1350 మంది విద్యార్థులతో త్రివర్ణ పతాకంలోని అశోక చక్ర ఆకృతి, 24 ఆకులు సూచించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. అక్షర రూపంలో ప్రదర్శిస్తూ 45,000వేల అడుగుల్లో జాతీయ జెండా రూపంలో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అశోక ధర్మ చక్రం ప్రతిజ్ఞను చేయించారు. అశోక చక్ర ప్రతిజ్ఞ జీవితంలో ఆచరిస్తే ప్రతి ఒక్కరి జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుందని తెలిపారు. రాబోవు తరాలకు దేశభక్తి, నైతికత, సమగ్రత, కుల, మతాలకతీతంగా దేశ ఔన్నత్యాన్ని విద్యార్థుల్లో ప్రతిబింబించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సహంగా పాల్గొన్నారు.