తెలంగాణ

telangana

ETV Bharat / videos

మంచులో గర్భిణీని 14 కిమీ మోసుకెళ్లిన జవాన్లు.. రెండు ప్రాణాలు సేఫ్ - స్ట్రెచర్​పై గర్భిణీ సైనికులు రామ్​బన్​ జిల్లా

By

Published : Jan 16, 2023, 1:45 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

జమ్ముకశ్మీర్​లో ఆర్మీ​ జవాన్లు మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని 14 కిలోమీటర్లు మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు. ఖారీ ప్రాంతంలోని హర్గం అనే గ్రామంలో ఓ కుటుంబం, ఆ గ్రామ సర్పంచ్​ నుంచి ఆర్మీకి ఓ మెడికల్​ మెడికల్​ ఎమర్జెన్సీ కాల్​ వచ్చింది. ఓ గర్భిణీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఇచ్చారు. మంచుతో రోడ్లు జారుడుగా ఉన్నాయి. దీంతో జవాన్లు దాదాపు 6 అడుగులు ఉన్న మంచులో 6 గంటలు శ్రమించి మహిళను 14 కిలోమీటర్లు స్ట్రెచర్​పై మోసుకెళ్లారు. అంగారీ అనే గ్రామంలో మరో ఆర్మీ టీమ్​ అంబులెన్స్​ను సిద్ధంగా ఉంచింది. దీంతో గర్భిణీని సురక్షితంగా బనిలాల్​లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భిణీ బంధువులు జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details