ఆకట్టుకుంటున్న 'పెట్ కార్నివాల్'.. తిలకించేందుకు తరలివచ్చిన నగరవాసులు - నగరంలో ఆకట్టుకుంటున్న పెట్ కార్నివాల్
Hyderabad Pet Carnival: పెంపుడు జంతువులైన శునకం, పిల్లి, తదితర జంతువులు, పక్షుల ప్రదర్శన హైదరాబాద్లో సందడిగా ప్రారంభమైంది. హైదరాబాద్ పెట్ కార్నివాల్ పేరుతో రెండు రోజుల పాటు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో కొనసాగుతోంది. వివిధ జాతులకు చెందిన శునకాలను అందంగా అలంకరించి వాటికి పోటీలు నిర్వహించారు. ఉత్తమ స్థానాలు పొందిన వాటికి ప్రదర్శన నిర్వహకులు బహుమతులు అందజేశారు. జీవించగా మనుషులుగా మనకు ఎంత హక్కు ఉందో జంతువులకూ అంతే ఉందని తెలంగాణ కెనైన్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఏ జంతువూ హాని చేయదని... భయంతోనే వాటిపై దాడులు చేస్తున్నారని... పామును, వివిధ రకాల పక్షులను ప్రదర్శిస్తూ వివరించారు. ప్రదర్శనలో వివిధ జాతులకు చెందిన విదేశీ శునకాలు, మొసళ్లు, తొండలు, దున్నపోతులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శనను తిలకించేందుకు నగర వాసులు పెద్ద సంఖ్యలో వచ్చి... పక్షులను పట్టుకొని సందడి చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST